తెలంగాణ రాజకీయాల్లో (Telangana politics) సంచలనంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) పై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఎట్టకేలకు ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించింది. దాదాపు 16 నెలల పాటు విచారించిన కాళేశ్వరం కమిషన్‌ 650 పేజీలకు పైగా నివేదికను రెండు సీల్డ్‌ కవర్లలో ప్రభుత్వానికి అందజేసింది. నివేదికలో కమిషన్ ఏం తేల్చింది..? ఏయే అంశాలపై కమిషన్‌ నివేదికలో ప్రస్తావించిందని ఆస‌క్తిక‌రంగా మారింది. కమిషన్ నివేదిక అందడంతో ప్రభుత్వం తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ (Next step) ఏంటి అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

మూడు అంశాలను కమిషన్‌ నివేదికలో ప్రస్తావించింది. డిజైన్‌లో మార్పులు, నిర్మాణ లోపాలు, ఆర్థికపరమైన అంశాలపై నివేదిక సమర్పించింది. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు నిధులు విడుదల చేయడం.. హైలెవల్‌ కమిటీ (High-level committee) అనుమతి లేకుండా బడ్జెట్‌ రిలీజ్ (Budget release) చేసిన‌ట్లు నివేదికలో ప్రస్తావించారు. IASలు, ఇంజినీర్ల మధ్య సమన్వయం లోపం.. క్షేత్రస్థాయి సిబ్బందితో నేరుగా నాటి ప్రభుత్వ పెద్దల సంప్రదింపులు జరపడంతో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు సమాచారం లేదని కమిషన్‌ స్పష్టం చేసింది. పూర్తిస్థాయి అనుమతులు లేకుండానే డిజైన్లు మార్పు చేసినట్లు కమిషన్‌ తేల్చిన‌ట్టు స‌మాచారం.

గత ప్ర‌భుత్వ‌ నేత‌లు, ఐఏఎస్‌ అధికారులు (IAS officers), సీనియర్‌ ఇంజినీర్లు (Senior Engineers) ఇలా అనేక మంది పాత్ర గురించి కమిషన్‌ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో మంత్రివర్గం తీసుకొనే నిర్ణయాలు..తదుపరి కార్యాచరణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశం లోపు నివేదిక సారాంశాన్ని ఈ కమిటీ అందించనుంది. కేబినెట్ (Cabinet) లో చర్చించిన తర్వాత రానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో నివేదికను ప్రభుత్వం సభ ముందుంచే అవకాశాలున్నాయి. శాసనసభ (Legislature)లో దీనిపై చర్చించాకే తదుపరి చర్యల దిశగా అడుగులు పడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ప్రధానంగా తుమ్మిడిహెట్టి (Tummidihetti) నుంచి మేడిగడ్డకు బరాజ్‌ లొకేషన్‌ మార్పుపై నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అనే అంశంపై కమిషన్‌ స్పష్టత నిచ్చిందని అంటున్నారు.

మరోవైపు.. నేటి కేబినెట్ భేటీ (Cabinet meeting) లో ఈ బ్రీఫ్ రిపోర్టుపై చర్చించి ఆ తదుపరి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PowerPoint presentation) ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దాంతో గత ప్రభుత్వంలో కాళేశ్వరం (Kaleswaram) పేరిట జరిగిన అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రజలకు వివరించి.. ప్రజల్లోనే గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలోని కీలక నేతలను దోషులుగా చూపించాలని ప్రభుత్వం డిసైడ్ అయిందని సమాచారం.

Leave a Reply