VIRA | కోడ్ వ‌ర్తించేదెన్న‌డో?

VIRA | కోడ్ వ‌ర్తించేదెన్న‌డో?

తొల‌గించ‌ని ప్లెక్సీలు.. విగ్ర‌హాల‌కు ముగుసు వేయ‌ని వైనం

వైరా, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల కోడ్ ఇంకా వ‌ర్తించ‌క‌పోవ‌డంపై ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. వైరా మండల పరిధిలోని పలు గ్రామాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేయకుండా య‌థాత‌థంగా ఉన్నాయి. ప్లెక్సీల‌ను తొల‌గించ‌డం గానీ, విగ్రహాలకు ముసుగు వేయడం గానీ అధికారులు చేయడం లేదు. ఎన్నికల కోడ్ (Election Code) నిన్న‌సాయంత్రం నుండే అమల్లో ఉన్నప్పటికీ అధికారులు ఇంకా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫ్లెక్సీలను విగ్రహాలకు ముసుగులు వేయాలని, ఎన్నికల అధికారుల సూచనలు పాటించాలని ప‌లువురు కోరుతున్నారు.

Leave a Reply