అసలు ఏం జరిగింది..?
యాదగిరి కొండ, ఆంధ్రప్రభ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం కొండ పైన గల బస్టాండ్ వద్ద భక్తురాలి పర్సును దొంగిలించిన ఒక మహిళను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(Special Protection Force) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్, కొత్తపేట, న్యూ మారుతి నగర్‌కు చెందిన వంగపల్లి వనజ స్వామి వారి దర్శనం అనంతరం తిరిగి వెళ్లే సమయంలో కొండ పై బస్టాండ్‌లో తన పర్స్ పోగొట్టుకుంది. ఆమె కంట్రోల్ రూమ్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ పర్సులో సుమారు రూ. 40వేల నగదు ఉందని తెలిపారు.
ఫిర్యాదు అందింన వెంటనే స్పందించిన సిబ్బంది ఎస్సై అనిల్ కుమార్(Anil Kumar), ఏ.ఎస్.ఐ.లు శ్రీనివాస్ రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, శ్రీకాంత్ ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్నఒక మహిళను గుర్తించారు.
ఆ మహిళను మల్రెడ్డి సవిత ఆర్.బి. రెడ్డి నగర్, అల్మాస్‌గూడ, బాలాపూర్, హైదరాబాద్(Hyderabad)గా గుర్తించి విచారించారు. ఆమె పర్స్ దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. దొంగిలించబడిన పర్సు, అందులో గల నగదు సుమారు రూ. 40 వేలను సిబ్బంది రికవరీ చేశారు. కమాండెంట్(Commandant) గారి పర్యవేక్షణలో, పట్టుబడిన మహిళను, రికవరీ చేయబడిన వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం యాదగిరిగుట్ట స్థానిక పోలీసు స్టేషన్‌లో అప్పగించారు.

