WGL | పేకాటరాయుళ్ల అరెస్ట్

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : నగర శివారు ప్రాంతంలో గుట్టుగా పేకాట జరుగుతోందని అందిన సమాచారంపై వరంగల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి నిర్వహించారు. కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమిడిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
జూద కేంద్రం నుండి మొత్తం రూ.55,700 నగదు, మూడు మోటార్ బైక్స్, ఆరు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది.
అరెస్ట్ అయిన వారిని చిన్నాల వేణు, గుగులోతు సురేష్, పిట్ట శ్రీనివాస్, గుంజ రాకేష్, సుంచు ప్రమోద్ కుమార్, మోడెం రాజేష్‌గా గుర్తించారు. అనంతరం వీరిని తదుపరి చర్యల కోసం కాజీపేట పోలీసులకు అప్పగించారు.
