హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : హోమ్ టెక్స్‌టైల్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా సుప్రసిద్ధమైన, భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ వ్యాపార సంస్థ వెల్‌స్పన్ వరల్డ్‌లో భాగమైన వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ (డబ్ల్యుఎల్ఎల్ ), టెక్సటైల్ రంగంలో ఆపరేటర్ స్థాయి ఉద్యోగాలపై దృష్టి సారించి పెద్ద ఎత్తున నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కార్యక్రమాలను ప్రారంభించడానికి జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకుంది.
కేంద్ర నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత శాఖల మంత్రి (స్వతంత్ర బాధ్యత ) జయంత్ చౌదరి, మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా సంయుక్తంగా ఈ పథకం ప్రారంభించారు. ఈసందర్భంగా వెల్స్‌పన్ లివింగ్ లిమిటెడ్ ఎండి అండ్ సీఈఓ దీపాలి గోయెంకా మాట్లాడుతూ… వెల్‌స్పన్ వద్ద మహిళలు కేవలం భాగస్వాములు మాత్రమే కాదు, భారతదేశ వస్త్ర పరిశ్రమ భవిష్యత్తును రూపొందించడంలో శక్తివంతమైన ఉత్ప్రేరకాలు అని తాము విశ్వసిస్తున్నామన్నారు.
వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ రాజేష్ జైన్ మాట్లాడుతూ… నైపుణ్యాభివృద్ధి అనేది ఉపాధి గురించి మాత్రమే కాదు, అవకాశాలను సృష్టించడం, వారి భవిష్యత్తును మార్చగల సామర్థ్యంతో ప్రజలను శక్తివంతం చేయడం గురించి అన్నారు. ఎన్ఎస్ డీసీతో తమ భాగస్వామ్యం ద్వారా తాము మరింత సమ్మిళిత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న వస్త్ర శ్రామిక శక్తిని సృష్టించడం, ఆర్థిక వృద్ధిని పెంచడానికి దోహదపడటం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.