హైదరాబాద్ : గృహ వస్త్రాలలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన, భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ వ్యాపార సంస్థ వెల్‌స్పన్ వరల్డ్‌లో భాగమైన వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ (డబ్ల్యుఎల్ఎల్ ) తమ తాజా ప్రచారం క్యుంకి ఫర్క్ పడ్తా హై ని ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ప్రచారంలో భాగంగా బ్రాండ్ రెండు చిత్రాలను విడుదల చేసింది. సుప్రసిద్ధ నటి విద్యా బాలన్ నటించిన ఈ రెండు చిత్రాలూ ఇంటిపై ధ్యాస, హాస్యం మిళితం చేసి హారర్ కామెడీ తీరులో నాణ్యమైన హోమ్ లినెన్ నిజంగా ఎందుకు ముఖ్యమో చెబుతాయి.
ఈసందర్భంగా వెల్‌స్పన్ లివింగ్ ఎండి అండ్ సీఈఓ దీపాలి గోయెంకా మాట్లాడుతూ… మన ఇళ్లలోకి మనం తీసుకువచ్చేది కేవలం వాడుక గురించి కాదని, ఇది నమ్మకం, శ్రద్ధ, ఎక్కువకాలం మన అవసరాలను తీర్చదగిన రీతిలో ఉండేందుకు అని ప్రతి గృహిణికి తెలుసన్నారు. ప్రతి కొనుగోలు ఆలోచనాత్మకంగా ఉంటుంది, నాణ్యత అనేది మనకు మనశ్శాంతిని ఇస్తుందన్నారు.
నటి విద్యా బాలన్ మాట్లాడుతూ… క్యా ఫర్క్ పడ్తా హై అని చాలా సార్లు నేను విన్నానన్నారు. ఈ చిత్రంలో చెప్పినట్లుగా, ప్రతిసారీ తాను చెప్పాలనుకున్నది, అవును, ఖచ్చితంగా ఫర్క్ పడ్తా హై!. సాధారణ , మెరుగైన, యాదృచ్ఛిక, ఆధారపడతగిన అంశాల మధ్య తేడా ఉంటుందన్నారు. ఆ సత్యాన్ని, కొంత నాటకీయత, కొంత హాస్యం, వాస్తవికతతో సజీవంగా తీసుకురావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.
ఏటీఓఎం నెట్‌వర్క్ సహవ్యవస్థాపకుడు అండ్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ యష్ కులశ్రేష్ఠ మాట్లాడుతూ… రోజువారీ ఇంటిలోపల వాడే వస్త్రాల కోసం బ్రాండ్ ఉత్పత్తులను ఎంచుకోవాల్సిన అవసరం లేదనే నిజమైన వినియోగదారు అలవాటును తీసుకున్నామన్నారు. ఆ భావనకు సాంస్కృతిక రుచి, విద్య స్క్రీన్ పై కనిపించటంతో కొంత నాటకీయతను జోడించామన్నారు. ఇది కేవలం అవగాహనను మెరుగు పరచటానికి మాత్రమే కాకుండా, ప్రాధాన్యతలను సైతం మార్చడానికి రూపొందించబడిన కథనమన్నారు.