Welfare | విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి

Welfare | విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి
- శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్
Welfare | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం(coalition government) కృషి చేస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జడ్పీ హాల్లో(In ZP Hall) నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, నరసన్నపేట ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను విభిన్న ప్రతిభావంతులు(Talented) సద్వినియోగం చేసుకుని మరింత అభివృద్ధి చెందాలని కోరారు.
విభిన్న ప్రతిభావంతుల పెన్షన్‌ను రూ.3వేల నుంచి రూ.6వేలకు పెంచి మరింత చేదోడుగా ప్రభుత్వం నిలుస్తోందన్నారు. విద్యార్థులకు అవసరమైన లాప్ ట్యాప్(Lap tap)లను, మరిన్ని ఉపకరణాలను వారికి అందజేసి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేశారు. వివిధ క్రీడలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన దివ్యాంగులకు(For the disabled) ప్రశంసా పత్రాలను, బహుమతులను అందజేశారు. ప్రత్యేక బ్రెయిలీ లిపితో కూడిన సెల్ ఫోన్లను కూడా అందజేశారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో సీఎస్ఆర్ నిధులతో, కేంద్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ(Welfare Department) సంయుక్త సహకారంతో జిల్లాకు అవసరమైన ట్రైసైకిళ్లను అందజేశారు. డిజేబుల్డ్ ఏడి శైలజ, జిల్లా నలుమాల నుండి విచ్చేసిన దివ్యాంగులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న దివ్యాంగులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
