Distribution | మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తాం

Distribution |లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీ సాయి ప్రగతి మండల సమాఖ్య కార్యాలయంలో ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా, కాంగ్రెస్ నాయకులు మహిళలకు చీరలను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కోటిమంది మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకువస్తోందని తెలిపారు.
తహసీల్దార్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. మండలానికి మొత్తం 7,160 చీరలు వచ్చినట్లు చెప్పారు. పంపిణీ కార్యక్రమాన్ని రెండు రోజుల్లో పూర్తిచేస్తామని వెల్లడించారు.
కార్యక్రమంలో అంకతి శ్రీనివాస్, ఆరీఫ్, పింగళి రమేష్, సుమన్ రవీందర్, ఏపీఎం భూమక్క, సీసీలైన లచ్చన్న, సురేందర్, వసంతలక్ష్మీ, జనార్దన్, సుమలతతో పాటు విఓలు, పలువురు సభ్యులు పాల్గొన్నారు.
