అనంతపురం బ్యూరో, ఏప్రిల్ 8 (ఆంధ్రప్రభ) : హంద్రీనీవాను పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, తదితరులు పర్యవేక్షించారు.
గుంతకల్ నియోజకవర్గం, కసాపురం వద్ద చేపడుతున్న హంద్రీనీవా కాలువ వైన్డింగ్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. హంద్రీనీవా కాలువ పూర్తి లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. గత ఐదేళ్లలో ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు జగన్ రెడ్డి.. ఇప్పుడు నీతులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రతి రూపాయి ప్రజల కోసం ఖర్చు చేస్తోందని, క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించి గడువు లోపల పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
