Telangana | దాడిని ఖండిస్తున్నాం..

Telangana | దాడిని ఖండిస్తున్నాం..
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
స్వచ్ఛందంగా ప్రవేట్ పాఠశాలలు బందు
Telangana | టేకుమట్ల, ఆంధ్రప్రభ : ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ పై దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి జిల్లా (Bhupalpally District) ట్రస్మా గౌరవ అధ్యక్షులు ఎండి రాజ్ మహమ్మద్, జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల రమేష్, టేకుమట్ల మండల జిల్లా ఈసీ మెంబర్ మియాపురం హరీష్ కుమార్ డిమాండ్ చేశారు.
గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా ప్రైవేట్ పాఠశాలలు బందు పాటించారు. సమావేశంలో ట్రస్మా (Trasma) ప్రజా ప్రతినిధులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. హనుమకొండ లోని స్మైలీ బిజీ స్కూల్ కరెస్పాండెంట్ ఎం శ్రీనివాస్ పై పి డి ఎస్ యు విద్యార్థి సంఘం నాయకులు చందా కోసం వచ్చి ఇవ్వనందుకు ఆయనపై భౌతికంగా దాడి చేశారని ట్రస్మా ప్రతినిధులు ఆరోపించారు.
దీనిపై పోలీస్ కమిషనర్ (Police Commissioner), జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో జిల్లా మెంబర్ సతీష్ కుమార్, బండి సంపత్ కుమార్, శ్రీధర్, శ్రీనివాస్, రవికుమార్, తదితర పాఠశాలల కరెస్పాండెంట్ పాల్గొన్నారు.
