ఎడ్జ్‌బాస్టన్ – వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)లో భాగంగా నేడు ఎడ్జ్‌బాస్టన్ లో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ అధికారికంగా రద్దయింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇంకా చల్లారకముందే ఇరు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌ను తీవ్రంగా విమర్శించిన షాహిద్ అఫ్రిది నేతృత్వంలోని జట్టుతో ఆడేది లేదని స్పిన్నర్ హర్భజన్‌సింగ్, ఓపెనర్ శిఖర్ ధవన్, సురేశ్ రైనా, ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ వంటివారు తెగేసి చెప్పారు.
Read Also | Shamshabad | స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం…తిరుపతి సర్వీస్ రద్దు
ఈ నేపథ్యంలో ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. అంతేకాకుండా క్షమాపణలు కూడా తెలిపారు. . ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వద్దకు అభిమానులు ఎవరూ రావొద్దని, టికెట్ డబ్బులను పూర్తిగా రీఫండ్ చేస్తామని ఓ ప్రకటనలో నిర్వాహకులు తెలిపారు. దీంతో ఈ టోర్నీలో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.
Pingback: Tiruvuru | పోలీసుల అదుపు మిస్సింగ్ తిరువూరు ఎఈఈ - Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in