- అడవుల్లో బాంబులు గిరిజన గుండెల్లో గుబులు
- ఎంత కాలం ఈ అరాచకాలు ఇకనైనా ఆపండి..
- మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన కరపత్రాలు
వాజేడు ఏప్రిల్ 14 ఆంధ్రప్రభ : మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల వ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా గిరిజన యువజన సంఘం పేరిట కరపత్రాలు వెలిశాయి. మండలంలోని పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల టేకులగూడెం కృష్ణాపురం కడేకల్ పేరూరు అదేవిధంగా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొప్పుసురు మురుమూరు ప్రగల్లపల్లి ప్రాంతంలో సోమవారం కరపత్రాలు వెలువడటంతో బయానక వాతావరణం ఏర్పడింది.
ఈ కరపత్రాల్లో అడవుల్లో బాంబులు గిరిజన గుండెల్లో గుబులు ఎంత కాలం ఈ అరాచకాలు అంటూ పొందుపరిచారు. గిరిజనులు అడవి జీవనాధారమైన అడవికి వెళ్లకుండా మావోయిస్టులు బాంబులు అమర్చడం సరైన పద్ధతి కాదని మావోయిస్టులపై తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిస్తూ కరపత్రంలో పొందుపరిచారు. మావోయిస్టుల అరాచకాలు ఆపాలన్నారు. మండల వ్యాప్తంగా కరపత్రాలు వెలువడడంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.