Waterfall | ముగ్గురి ప్రాణాలు తీసింది

Waterfall | ముగ్గురి ప్రాణాలు తీసింది
Waterfall | అల్లూరి జిల్లా, ఆంధ్రప్రభ : అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణ గటన హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ ముల్లుగుమ్మి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన అనంతగిరి మండలం మల్లంగుమి గ్రామ సమీపాన జలపాతం వద్ద జరిగింది.
జంబవలస గ్రామానికి చెందిన నలుగురు యువతులు పండుగ సందర్భంగా మల్లంగుమి జలపాతానికి వెళ్లారు. యువతుల్లో కొందరు సరదాగా ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జలపాతంలోని ఓ పెద్ద రాతిబండపైకి ఎక్కిన ముగ్గురు ప్రమాదవశాత్తూ నీటిలో జారి పడ్డారు. ఈ ప్రమాదానికి ముగ్గురు యువతులు మృతి చెందారు. మరో యువతిని స్థానికులు సాహసంగా రక్షించారు.
