Water | తాగునీటి సమస్యను పరిష్కరించండి

Water | తాగునీటి సమస్యను పరిష్కరించండి

  • అసెంబ్లీలో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే పరిటాల సునీత
  • జీరో అవర్ లో నీటి సమస్యపై మాట్లాడిన ఎమ్మెల్యే సునీత
  • పీఏబిఆర్ నుంచి చేపట్టిన తాగునీటి పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేయాలన్న సునీత
  • పెండింగ్ లో ఉన్న బిల్లులు మంజూరు చేయాలని విజ్ఞప్తి

Water | అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : రాప్తాడు నియోజకవర్గంలో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే పరిటాల సునీత అసెంబ్లీలో తన వాణి వినిపించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జీరో అవర్ లో ఎమ్మెల్యే సునీత అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలాల్లో నెలకొన్న తాగునీటి సమస్య గురించి ప్రస్తావించారు. 2మండలాల్లో సుమారు 50గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉందన్నారు. అనంతపురం రూరల్ మండలం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో జనాభాకు ఇప్పుడు వస్తున్న నీరు సరిపోవడం లేదన్నారు.

అందుకే ప్రభుత్వం 90కోట్ల జల జీవన్ మిషన్ నిధులతో పీఏబిఆర్ నుంచి తాగునీటి పైప్ లైన్, ట్యాంకుల నిర్మాణాలు చేపట్టారన్నారు. మెయిన్ పైప్ లైన్ అనంతపురం వరకు పూర్తి అయిందని.. ఇంకా కొంతవరకు పనులు చేయాల్సి ఉందన్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు మంజూరు చేయకపోవడం వలన పనులు ఆగిపోయాయన్నారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు ఉంటే.. వేసవిలో తాగునీటి సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు.

ఇప్పటికే 70శాతం వరకు పనులు పూర్తయ్యాయని.. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న బిల్స్ మంజూరు చేయాలని కోరారు. పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి పై రెండు మండలాలతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో త్రాగునీటి సమస్య ఏర్పడే గ్రామాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హంద్రీనీవా నీరు రాని ప్రాంతంలో వెయ్యి అడుగులు బోరు వేసినా నీరు పడటం లేదన్నారు. ఈ పరిస్థితి గమనించి.. నీటి సమస్యపై సత్వరమే స్పందించాలని ఎమ్మెల్యే సునీత కోరారు.

Leave a Reply