వేగం తగ్గించండి…మద్యం సేవించి వాహనం నడపొద్దు

వేగం తగ్గించండి…మద్యం సేవించి వాహనం నడపొద్దు

  • క్రాస్ రోడ్ల వద్ద నెమ్మదిగా వెళ్లాలి
  • ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను నివారించగలం
  • హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి
  • ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వాహనదారులు ట్రాఫిక్ నియ మాలను తప్పనిసరిగా పాటించాలని స్టేషన్ ఘన్‌పూర్ సీఐ జి. వేణు సూచించారు. క్రాస్ రోడ్ల వద్ద వాహనాలను నెమ్మదిగా నడపాలి. మద్యం సేవించి వాహనం నడపకూడదు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. సోమవారం మండల పరి ధిలోని ఘన్‌పూర్, చాగల్లు, రాఘవపూర్ గ్రామాల జాతీయ రహదారి పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి నెమ్మదిగా వెళ్లండి, మద్యం సేవించి వాహనం నడపకండి వంటి హెచ్చ రిక బోర్డులను ఆయన ఏర్పాటు చేయించారు.

ఈ సందర్భంగా సీఐ జి. వేణు మాట్లాడుతూ ఆ ప్రాంతాల్లో వాహనదారులు వేగంగా వెళ్లడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకా శాలు అధికంగా ఉన్నాయని అన్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండేలా చేయడానికి ఈ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలి పారు. ముఖ్యంగా క్రాస్ రోడ్ల వద్ద వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు.

-కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురి చేయొద్దు:

ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధికశాతం మంది హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు బలమైన గాయాలు తగిలి ప్రాణాలు కోల్పోతూ..తమ పై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని సీఐ వేణు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నియమ, నిబంధనలపై వాహనదారులతో పాటు పాదచారులకు పూర్తి అవగాహన ఉన్నప్పుడే..ప్రమాదాలను నివారించడం సాధ్యం అవు తుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కు వ మంది హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలు తగిలి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రమాదాలు మానవ తప్పిదాల వల్ల మాత్రమే జరుగుతాయి. మనమందరం ట్రాఫిక్ నియమాలు ఖచ్చితం గా పాటించినట్లయితే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చని పేర్కొన్నారు.

Leave a Reply