మంత్రి వివేక్ ను విమర్శిస్తే సహించేది లేదు..

మంత్రి వివేక్ ను విమర్శిస్తే సహించేది లేదు..

చెన్నూర్ ఆంధ్రప్రభ : గత నాల్గు రోజుల క్రితం జరుగనున్న క్యాతన్ పల్లి మున్సిపల్ చెర్మెన్ ఎంపికలో బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రి వివేక్ పై చేసిన వాఖ్యలను నూతన చెర్ పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చెర్మెన్ వినయ్,కౌన్సిలర్,లు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇవ్వాళా స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం గురించి బాల్క సుమన్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వలించినట్లు ఉందని ఎద్దేవ చేశారు.

గత మున్సిపాల్టీ ఎన్నికల్లో చెన్నూరు మున్సిపల్ ఎలాంటి ఎన్నికలు జరుగకుండా ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేసి చెన్నూరు పాలకవర్గాన్ని ఏర్పాటు చేసిన విధానాన్ని ప్రజలు గమనించే ప్రజలు సుమన్ కు గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. మంత్రి వివేక్ ప్రజాస్వామ్య రక్షణ అడుగులు వేస్తూ నిజాయితీ గా ఎన్నికలు నిర్వహించారాని, మంత్రి వివేక్, ఎంపీ వంశీ తమ తమ ఎక్స్ ఆఫీషియో ఓటు హక్కును వినియోగించుకోనేందుకు వస్తుంటే వారిపై బాల్క సుమన్ తన అనుచరులతో దాడులు చేసి మంత్రి పై తప్పుడు ఆరోపనులు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

మహిళలను కించపరచరని ఆరోపిస్తున్న బాల్క సుమన్ నీ వెనుకలే ఉన్న ఓ మహిళ కానిస్టేబుల్ పైన చేయి వేస్తె చూస్తూ ఉన్నవే తప్ప ఏమి అన్నాలేదే అని ప్రశ్నిచారు. బిఆర్ నాయకులు బాల్క సుమన్ మంత్రి పై, ఎంపీ వంశీకృష్ణ పై తప్పుడు ఆరోపణలు చెస్తే ప్రతీకార చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Leave a Reply