Ward members | గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాం

Ward members | గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాం

Ward members | ఖానాపూర్ రూరల్‌, ఆంధ్రప్రభ : మండలంలోని గ్రామ పంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, పాలకవర్గాలు ఇవాళ అధికారికంగా కొలువుదీరాయి. మండల పరిధిలోని మొత్తం 23 గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో గ్రామస్థుల సమక్షంలో కార్యక్రమాలు నిర్వహించగా, ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని సర్పంచులు పేర్కొన్నారు. కొలువుదీరిన పాలకవర్గాలకు గ్రామస్థులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమగ్రాభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. దీంతో మండలంలోని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలనకు శ్రీకారం చుట్టారు.

Leave a Reply