Warangal | రైతన్న బాగుంటేనే సమాజం…

Warangal | రైతన్న బాగుంటేనే సమాజం…
Warangal | డోర్నకల్, ఆంధ్రప్రభ : డోర్నకల్ పట్టణంలోని మెయిన్ రోడ్డులో క్రిష్ణా ట్రేడర్స్(Krishna Traders) నూతన ఎరువుల దుకాణాన్ని యజమాని నాగరాజు తల్లిదండ్రులచే ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నాగరాజు మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులను అందించాలనే లక్ష్యంతో ఈ దుకాణం ప్రారంభించినట్లు వారు తెలిపారు.
రైతన్న బాగుంటేనే సమాజం కళకళలాడుతుందని, వ్యాపారాలు సక్రంగా సాగుతాయని వారు తెలిపారు. పట్టెడన్నం పెట్టే రైతన్న శ్రేయస్సే దేశ శ్రేయస్సు అని పేర్కొన్నారు. డోర్నకల్ మండల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మురళి(Murali), ఏనుగు వెంకటరెడ్డి, బాలాజీ, సత్యనారాయణ, సందీప్, భాస్కర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
