Warangal | ఘనంగా వనభోజన మహోత్సవం

Warangal | ఘనంగా వనభోజన మహోత్సవం
Warangal | కరీమాబాద్, ఆంధ్రప్రభ : తెలుగు మాసాలలో కార్తీక మాసం ఎంతో పరమ పవిత్రమైనది. ఇది శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం అని తెలంగాణ ఉపాధ్యాయ పరపతి సంఘం కన్వీనర్ విశ్రాంత ఉపాధ్యాయుడు రాజ గోవింద్ (Raja Govind) అన్నారు.
ఈనెల 16 ఆదివారం కిలా వరంగల్ గ్రామంలో జరిగే పద్మశాలి కార్తీక మాస వనభోజన మహోత్సవానికి పద్మశాలి కుల బందువులు, వర్తక వాణిజ్య ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయ లోకం భారీగా తరలివచ్చి శివకేశవుల కటాక్ష(Siva Keshava) వీక్షణాలకు పాత్రులు కాగలరని తెలంగాణ పద్మశాలి ఉపాధ్యాయ పరపతి సంఘం ప్రతినిధి రాజ గోవిందు పద్మశాలి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
వనభోజనం అనగా వనం అంటే అడవి భోజనం అంటే ఆహారం స్వీకరించుట ఈ మాసంలో ఉసిరివనం, ఉసిరి చెట్టు కింద సామూహికంగా భోజనం చేయడం వల్ల శివకేశవుల ప్రసన్నత కలగడమే కాక సమస్త పాపాలు తొలగి ధన, కనక, వస్తు వాహన, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
