Warangal | దేశవ్యాప్త సమ్మెను విజయవంతం…

Warangal | దేశవ్యాప్త సమ్మెను విజయవంతం…
Warangal | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ శివనగర్ సిపిఐ కార్యాలయంలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ వామపక్ష పార్టీలు బి ఆర్ టి యు ఆధ్వర్యంలో జరిగిన సమ్మె విజయవంతం చేసిన సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ అధ్యక్షతన శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్టియు తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్, సిఐటియు జిల్లా ఆరూ ర్ కుమార్, ఏ ఐ సి టి యు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు గంగుల దయాకర్, ఏఐసిసిటియు అక్కనపల్లి ,యాదగిరి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పనస ప్రసాద్ సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య, ఎం సిపిఐ యు నగర కార్యదర్శి మాలోత్ సాగర్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి రాచర్ల బాలరాజ్, ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసినందుకు వరంగల్ జిల్లా కార్మిక వర్గానికి రైతాంగానికి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ పోరాటము ఇంతటితో ఆగిపోదని బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కొడ్లును రద్దుచేసి 29 కార్మిక చట్టాలను కొనసాగించేంతవరకు వరంగల్ జిల్లాలో ఉమ్మడిగా కలిసి పోరాటం ఉదృతం చేస్తామని తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం ఈ సమ్మె ద్వారా కార్మిక హక్కులను కాపాడుకోడం కోసం పెద్ద ఎత్తున సమ్మెలు చేయడం జరిగింది ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని లేనిచో అన్ని కార్మిక సంఘాలను వామపక్ష లౌకిక శక్తులను కలుపుకొని రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షులు చెన్నకేశవులు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎండి బషీర్ ఏ సి టి యు జిల్లా అధ్యక్షులు సుంచు జగదీశ్వర్ బి ఆర్ టి యు జిల్లా నాయకులు దుబ్బ శ్రీనివాస్ ఏ ఐ టి యు సి జిల్లా సహకార దర్శి సంఘీ ఏలేందర్ యాకూబ్ బి ఆర్ టి నాయకులు మోడం ప్రవీణ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
