Warangal | కేరళ రాష్ట్రం బిజెపి మేయర్ కార్పొరేటర్లకు ఘన స్వాగతం

Warangal | కేరళ రాష్ట్రం బిజెపి మేయర్ కార్పొరేటర్లకు ఘన స్వాగతం

రైల్వేస్టేషన్లో స్వాగతం పలికిన బిజెపి జిల్లా అధ్యక్షుడు ఘంటారవి

Warangal | కరీమాబాద్, ఆంధ్రప్రభ: కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం బీజేపీ మేయర్, కార్పోరేటర్లకి వరంగల్ రైల్వేస్టేషన్లో వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంట రవికుమార్, కార్యకర్తలు మంగళవారం ఘన స్వాగతం పలికారు.2025 డిసెంబరులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, తిరువనంతపురం కార్పొరేషన్‌లోని 101 వార్డులలో బీజేపీ 50 స్థానాలను గెలుచుకుంది. తద్వారా కేరళలో తొలిసారిగా ఒక మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. వీరు ఫిబ్రవరి 9న తిరువనంతపురం నుండి ‘కేరళ ఎక్స్‌ప్రెస్’ రైలులో ఢిల్లీకి బయలుదేరి మంగళవారం వరంగల్ రైల్వే స్టేషన్లకి చేరుకున్న సందర్భంగా వారికి బీజేపీ శ్రేణులతో కలిసి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఘనస్వాగతం పలికారు.ఈ పర్యటన ద్వారా రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది

ఈ విజయానికి గుర్తుగా ప్రధాని మోదీ ఫిబ్రవరి 13న వీరికి తన నివాసంలో ప్రత్యేక విందు ఇవ్వనున్నారనీ ఘంటా రవికుమార్ తెలిపారు.
ఈ బృందం కేంద్ర మంత్రులు అమిత్ షా, జె.పి. నడ్డా వంటి అగ్రనేతలను కూడా కలవనుంది. అలాగే పార్లమెంట్ భవనాన్ని సందర్శించి, ప్రజాస్వామ్య పనితీరుపై అవగాహన పెంచుకోనున్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ శివనగర్ మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ, జిల్లా మీడియా కన్వీనర్ అంకాల జనార్ధన్, బిజెపి మండల నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్ , కందుకూరి విజయ్ కుమార్, శివశంకర్, రమేష్, సూరజ్, సాగరిక, స్రవంతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply