Warangal | ధాగా భగీరథ నీరు…

Warangal | ధాగా భగీరథ నీరు…
- రెండు రోజులు నీటి సరఫరా నిలిపివేత
Warangal | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరం 35వ డివిజన్ శివనగర్ లోని ప్రధాన వాటర్ పైపులైను పగిలిపోవడంతో నీరు వృధాగా పోతుంది. శివనగర్లో అండర్ డ్రైనేజీ నిర్మాణం కొనసాగుతుంది అభివృద్ధి పనులు కోసం జెసిబిని ఉపయోగించారు జెసిబి ప్రధాన పైపులైనుకు త్రాకడంతో పైపులైను పగిలిపోయింది.
దీంతో ప్రధాన వాటర్ ట్యాంక్ కు నీరు సరఫరా నిలిచిపోయింది పైపులైన్ మరమ్మతులు చేపట్టడంతో సోమవారం మంగళవారం రెండు రోజులు నీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందని మరమ్మత్తుల పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరా పునరుద్ధరించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
