WAR | అమెరికా, ఇజ్రాయెల్ చిత్తుగా ఓడాయి..

WAR | అమెరికా, ఇజ్రాయెల్ చిత్తుగా ఓడాయి..
WAR | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తమ దాడులకు ట్రంప్ భయపడ్డాడని ఇరాన్ తెలిపింది. యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ చిత్తుగా ఓడిపోయాయని తెలిపింది. తమ హెచ్చరికలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిగివచ్చారని ఇరాన్ పేర్కొంది. ఆయన మరోసారి దిగి వచ్చారంది. ట్రంప్ తమ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తామని.. ఇజ్రాయెల్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, సమాచార, ప్రసార సాంకేతికతలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
