Wankidi | మొదలైన అభివృద్ధి పనులు

Wankidi | మొదలైన అభివృద్ధి పనులు

  • చెడిపోయిన బోర్ వెల్ కు మరమ్మత్తు పనులు
  • గ్రామాభివృద్దే తన ద్యేయం అంటున్న నూతన సర్పంచ్

Wankidi | వాంకిడి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని బంబార గ్రామ పంచాయతీ సమస్యలపై నూతన సర్పంచ్ బెండరే. కృష్ణాజి దూసుకుపోతున్నారు. ఉప సర్పంచ్. జాడే సంతోష్ తో కలిసి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు. అభివృద్ధికి పెద్దపీట వేసేలా దృష్టి పెడుతున్నారు. గ్రామ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామంలో కొత్త కాలనీలో చెడిపోయిన బోర్వెల్స్ ను ఇవాళ మరమ్మత్తు పనులు చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గ్రామాభివృద్ధికి , గ్రామ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టానన్నారు. పంచాయతీలో ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రధానంగా నీటి సమస్య తలెత్తకుండా చెడిపోయిన బోర్ వెల్ మరమ్మత్తు పనులు చేయించామని అతను తెలిపారు. వీరితో పాటు గ్రామపంచాయితీ సెక్రెటరీ, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply