Wadde Obanna | వీరత్వానికి మారుపేరు వడ్డే ఓబన్న

Wadde Obanna | వీరత్వానికి మారుపేరు వడ్డే ఓబన్న
- ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
Wadde Obanna | జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : వీరత్వానికి మారుపేరు వడ్డే ఓబన్న అని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో వడ్డేర సంఘం ఆధ్వర్యంలో ఒడ్డెరుల పోరాట యోధుడు వడ్డే ఓబన్న(Wadde Obanna) జయంతిని ఈ రోజు సాయంత్రం నిర్వహించారు.
ఓబన్న చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడైన వడ్డే ఓబన్న అందించిన స్ఫూర్తిని అందరూ స్మరించుకోవాలన్నారు. ఓబన్న జీవిత చరిత్ర అందరికీ ఆదర్శమని, మెరుగైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్, వైస్ చైర్మన్లు లక్ష్మీనారాయణ, ఫసిహుల్ల, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎర్ర చంద్రశేఖర్, జన్నారం సర్పంచి అజ్మీర కళావతి- నందు నాయక్, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండికోట కృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షుడు ముజఫర్, ఓడ్డెర సంఘం మండలాధ్యక్షుడు బొంతల లక్ష్మణ్, సలహాదారుడు మోహన్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్లు మహేష్, గోపి, ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, కార్యదర్శి ప్రకాష్, నేతలు ముత్యం రాజన్న, సతీష్, ఇందయ్య ,టౌన్ ప్రెసిడెంట్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
