Vuyyuru | బ్యానర్ల తయారీదారులకు హెచ్చరిక..

Vuyyuru | బ్యానర్ల తయారీదారులకు హెచ్చరిక..

Vuyyuru | ఉయ్యురు, ఆంధ్రప్రభ : ఏ విషయంపై అయినా ఫ్లెక్సీలు, బ్యానర్లు తయారు చేసేటప్పుడు వాటి మీద రాసే రాతలు, ముద్రించే చిహ్నాలు రాజకీయంగా గాని, మతపరంగా గాని, కులాల పరంగా గాని వర్గాలపరంగా గాని, మరి ఏ విధంగానూ కూడా అవతలి వారిని రెచ్చగొట్టే విధంగా ఉండరాదని ఉయ్యురు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఒకవేళ అలా ముద్రించి సదరు విషయంలో ఎటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నా తక్షణం కేసులు నమోదు చేయబడతాయన్నారు. ఆయా కేసులలో ఎవరైతే ఫ్లెక్సీలు, బ్యానర్ల తయారీదారులున్నారో వాళ్ళను కూడా ముద్దాయిలుగా ఖచ్చితంగా చేర్చడం జరుగుతుందన్నారు. ఎవరైనా అటువంటి వాటి తయారీ కోసం మీ దగ్గరికి వచ్చి ఉంటే మాకు ముందస్తుగా సమాచారం తెలియపరచాలన్నారు.

Leave a Reply