ఇంటింటి ప్రచారం చేస్తున్న వెన్ రెడ్డి సంధ్య రాజు

ఇంటింటి ప్రచారం చేస్తున్న వెన్ రెడ్డి సంధ్య రాజు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల పట్టణ కేంద్రంలోని 16వ వార్డు చెరుకు బావి ఏరియాలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వెన్ రెడ్డి సంధ్య రాజు గడప గడపను తట్టి ఓటర్లను కలిసి చెయ్యి గుర్తుపై దయతో ఓట్లు వేసి గెలిపించి ఆశీర్వదించమని అభ్యర్థించారు.
వార్డులో కరబత్త తాజా మాజీ చైర్మన్ రెడ్డి రాజు చేసిన అభివృద్ధిని చూసి నన్ను ఆశీర్వదించి మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. నేను మీ కుటుంబంలో ఒకరినై ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
