voters | పోలింగ్ కేంద్రాల సందర్శన
- ఎన్నికల బందోబస్తు పర్యవేక్షణ…
- పోలింగ్ ప్రక్రియ పై రామగుండం పోలీస్ కమిషనర్ ఆరా..
voters | రామగుండం, ఆంధ్రప్రభ : రామగుండం కమిషనరేట్(Commissionerate) పరిధిలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంథని మండలం గుంజపడుగు, నాగారం, చిల్లపల్లి, వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ(queue management), వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపాయాలను పరిశీలించారు. ఓటింగ్ తరువాత, కౌంటింగ్ ప్రక్రియ, ఫలితాల వెల్లడి తరువాత కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, శాంతియుతంగా సాగుతున్నదా అనే అంశంపై ప్రత్యక్షంగా ఆరా తీసిన కమిషనర్, పోలింగ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సూచనలు అందించారు. పోలింగ్ కేంద్రాల(polling stations)ను సందర్శించిన సందర్భంలో ఓటర్లతో కూడా కమిషనర్ మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పోలీసు సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.
ఎన్నికల శాంతి భద్రత కోసం పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, ఓటర్లు(voters) భయభ్రాంతులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.

