Voters | గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా

Voters | గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా
- నిజాంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి చలిమేటి నరేందర్
Voters | నిజాంపేట, ఆంధ్రప్రభ : ఒక్కసారి అవకాశమిచ్చి గ్రామ సర్పంచ్ గా గెలిపించాలని.. నిజాంపేట్ గ్రామసర్పంచ్ అభ్యర్థి చలిమేటి నరేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం నిజాంపేట్ గ్రామంలో నరేందర్ ఇంటింటికి ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఈనెల 14న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారితే గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.
గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తానని, సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించాలని ప్రజలకు విన్నపించారు. గ్రామంలోని యువతకు అండగా ఉంటానని పేర్కొన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి తనను భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. మీ గ్రామ బిడ్డగా సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కోరారు. గ్రామంలో నిర్వహించే ప్రచారానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు.
