Voters | గ్రామాభివృద్ధి కోసం అవకాశమివ్వండి

Voters | గ్రామాభివృద్ధి కోసం అవకాశమివ్వండి

Voters | ధర్మపురి, ఆంధ్రప్రభ : తుమ్మెనాల గ్రామం అభివృద్ధి కోసం తనకు ఒక అవకాశం కల్పించి సర్పంచ్ గా గెలిపించాలని తుమ్మెనాల సర్పంచ్ అభ్యర్థి గొడిసెల రవికుమార్ ఓటర్లను కోరారు. శుక్రవారం గ్రామంలోని పలువాడల్లో ఇంటింటికి తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఓటు అభ్యర్థించారు.

గ్రామంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామానికి అత్యధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. వాడ వాడలా ప్రజలు ఓటు వేస్తామని మాట ఇచ్చారు. గ్రామాన్ని సుందరంగా తీర్చి మండలంలోనే ఆదర్శంగా నిలుపుతానని హామీ ఇచ్చారు.

Leave a Reply