Voter | జాబితాను సరిచేయాలి

Voter | జాబితాను సరిచేయాలి

  • మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ శ్రేణులు
  • గంటపాటు ఆందోళన
  • దొంగ ఓట్లను ఏరివేయాలని డిమాండ్

Voter | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో ఓటరు జాబితాను సరిచేయాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇవాళ‌ మున్సిపల్ కార్యాలయ ముట్టడికికి పిలుపునిచ్చారు. కాగా పోలీసులు భారీగానే బందోబస్తు నిర్వహించినప్పటికీ ఒక్కసారిగా బీజేపీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయానికి చొచ్చుకొని వచ్చారు. కార్యాలయంలోకి రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో బీజేపీ శ్రేణులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది.

Voter

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్దమవుతున్న వేళ ఓటరు ముసాయిదాను విడుదల చేసింది. అయితే అందులో ఆయా వార్డుల్లో ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని బీజేపీ నాయకులు ఆరోపించారు. అలాగే ఆయా వార్డుల్లో దొంగ ఓట్లు నమోదు చేశారని వాటిని తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో ముట్టడి చేపట్టామన్నారు. మున్సిపల్ ఎన్నికలు పారదె జరిగేలా చూడాలని కోరారు.

Voter

అయితే కావాలని అధికార పార్టీ ఇలాంటి కుట్రలకు పాల్పడడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా ఇంటింటికీ తిరిగి ఓటరు సర్వే చేయాలన్నారు. అలా కాకుండా దొంగ ఓట్లతో గెలవాలని అధికార పార్టీ కుట్రలు చేస్తుందని పేర్కొన్నారు. న్యాయబద్ధంగా ప్రశ్నిస్తే తమను అక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుల తడకగా ఉన్న ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి దొంగ ఓట్లను ఏరివేయాలని డిమాండ్ చేశారు. కాగా గంట పాటు మున్సిపల్ ఎదుట నిరసన కొనసాగింది. నిరసన చేస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply