Voter | ముసాయిదా జాబితా విడుదల

Voter | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 12 వార్డులలో వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ జాబితాను ఈ రోజు సాయంత్రం మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డుపై ప్రచురించినట్టు కమీషనర్ బి శ్రీనివాస్ తెలిపారు. తహసీల్దార్ , ఎంపీడీవో కార్యాలయాల నోటీసు బోర్డుల్లో కూడా ముసాయిదా జాబితా అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు. జాబితాను పరిశీలన చేసుకుని అభ్యంతరాలు ఏమైనా ఉంటే కార్యాలయాల పనివేళళ్లో తెలపాలన్నారు. మున్సిపల్ మేనేజర్ జగన్మోహన్, వార్డు ఆఫీసర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
