VOTE | మాటల గారడీ చేసే వాళ్లను నమ్మకండి : సర్పంచ్ అభ్యర్థి లలిత శ్రీశైలం
VOTE | షాద్ నగర్, ఆంధ్రప్రభ : మాటల గారడీలు చేసే వాళ్ల మాటలకు మోసపోవద్దని, వారి మటలు నమ్మొద్దని , సమర్థవంతున్ని ఎన్నుకోవాలని ఎలికట్ట గ్రామ సర్పంచ్ అభ్యర్థి కావలి లలితా శ్రీశైలం అన్నారు. ఎలికట్ట గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపాలన్న ధ్యేయంతో తాను పోటీ చేసినట్లు చెప్పారు. తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని ఆమె నిర్వహించారు. ఎలికట్టను అభివృద్ధిపరిచే వ్యక్తికే ఓటు వేసి గెలిపించాలని సూచించారు. తాము ఎంపీటీసీగా ఉన్నప్పుడు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

