స్మశాన వాటిక పనులకు స్వచ్చందంగా సహకారం..

స్మశాన వాటిక పనులకు స్వచ్చందంగా సహకారం..

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 65వ డివిజన్ చింతగట్టు, సుభాష్ నగర్ లో స్మశాన వాటిక నిర్మాణ పనులకు కాయిత రఘువీర్ రెడ్డి స్వచ్ఛందంగా తన సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా కాయితపు రఘువీర్ రెడ్డిని స్థానికులు అభినందించారు. స్మశాన వాటికలోని బోరు నిర్మాణ పనులు చేపట్టలేదు. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా అందిన సమాచారంతో రఘువీర్ రెడ్డి స్పందించారు.

ఈ మేరకు బోర్ నిర్మాణ పనులకు కావల్సిన మెటీరియల్ ను స్వచ్చందంగా అందజేశారు. దీంతో బోర్ నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు. నిర్మాణ పనులతో బోర్ యధావిధిగా పని చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా స్మశాన వాటిక బోర్ నిర్మాణ పనులకు సహకారాన్ని అందించిన రఘువీర్ రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోంపల్లి మహేందర్, నద్ధునూరి సంపత్, మేకల ఐలయ్య, కృష్ణంరాజు, సంపత్ రాజు,హరీష్, ప్రశాంత్ రాజు పుల్ల అజిత్, కోటేశ్వర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply