Volleyball kits | క్రీడలతో శారీరక దృఢత్వం

Volleyball kits | క్రీడలతో శారీరక దృఢత్వం
Volleyball kits | ఊట్కూర్, ఆంధ్రప్రభ : క్రీడలు ఆడడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని ఓబులాపూర్ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి అన్నారు. ఇవాళ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఓబులాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద క్రీడాకారులకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు స్నేహభావం పెంపొందుతుందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇస్తాయని, ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడటం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందన్నారు. క్రీడాకారులు తమ నైపుణ్యాలను, మెలకువలను ప్రదర్శించి, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. యువకులు, క్రీడాకారులు స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగుతూ మార్గనిర్దేశాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
