పాయం జాతరలో వాలీబాల్ పోటీల ప్రారంభం

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని నడిమిగూడెం పంచాయతీలోని 8మండలాల స్థాయి వాలీబాల్ పోటీలను స్థానిక సర్పంచి తెల్లం సంధ్య కుమారి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత పాయం వంశీయుల కమిటీ సభ్యులు క్రీడాకారుల పరిచయ కార్యక్రమం చేపట్టారు.

అనంతరం సర్పంచి తెల్లం సంధ్యకుమారి మాట్లాడుతూ.. మూడేళ్లకు జరిగే పాయం వంశీయుల జాతరకు ఉమ్మడి రాష్ట్రాల వ్యాప్తంగా భక్తులు ప్రజలు పాయం కుటుంబికులు, బంధువులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం గర్వకారణమన్నారు. అదే క్రమంలో ప్రతి ఏటా మార్చి నెలలో జాతరను నిర్వహిస్తామని తెలిపారు.

ఈ ఏడాది10 నుంచి 5 రోజుల పాటుగా జాతర వేడుకలు నిర్వహిస్తూ, 8 మండలాలస్థాయి వాలీబాల్ పోటీలకు క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొనడం శుభపరిణామన్నారు. ఈ నేపథ్యంలో నేడు 12న గర్భగుడికి పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ఏదేమైనా 5 రోజుల జాతరకు నిర్వాహకులు అహర్నిశలు శ్రమించి కృషి చేయడం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో పాయం ఆలయ కమిటీ పాయం సత్యనారాయణ, నరసింహారావు, రమేష్, రాంబాబు, రామనరసయ్య రాఘవాపురం సర్పంచి, క్రీడాకారులు, గ్రామస్తులు, వడ్డీలు, తలపతులు భక్తులు, తెల్లని జానీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply