Vodafone Idea | స్టార్‌లింక్‌తో వొడాఫోన్‌ చర్చలు..

జియో, ఎయిర్‌టెల్‌ బాటలోనే వొడాఫోన్‌ కూడా అదేబాట పట్టింది. తన నెట్‌వర్క్‌ సేవల్ని మరింత మెరుగుపరుచుకుని, టెలికం సేవల్ని మరింత విస్తరించడానిక స్నేస్‌ఎక్స్‌తోపాటు ఇతర శాట్‌కామ్‌ ప్రొవైడర్లతో చర్చలు జరుపుతున్నట్లు వొడాఫోన్‌- ఐడియా తెలిపింది.

ఎలాన్‌మస్క్‌కు చెందిన ఏరోస్పేస్‌ కంపెనీ స్పేస్‌ఎక్స్‌తో చర్చలు జరుపుతున్నంది. ఈ విషయాన్ని కంపెనీ తన ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌ ద్వారా వెల్లడించింది.

ఈ విషయంపై కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ జగ్బీర్‌సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ… కంపెనీ వ్యూహంలో భాగంగా తదుపరి నిర్ణయాలు ఉంటాయన్నారు. నెట్‌వర్క్‌ విస్తరణకు సరైన భాగస్వామ్యాన్ని ఎంపిక చేయడంపై ప్రస్తుతం చర్చ జరుగుతోందన్నారు. వొడాఫోన్‌-ఐడియా తాజాగా ముంబైలో 5జీ సేవల్ని ప్రారంభించింది. ఈ ప్రకటనలో నేపథ్యంలో స్టాక్‌మార్కెట్‌లో వొడాఫోన్‌- ఐడియా షేర్లు 5శాతం పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *