Vizianagaram | ఆ ముగ్గురుకి షోకాజ్ నోటీసులు..

Vizianagaram | ఆ ముగ్గురుకి షోకాజ్ నోటీసులు..


Vizianagaram, రామభద్రపురం, ఆంధ్రప్రభ : విజయనగరం జిల్లాలోని రామభద్రపురం మండల కేంద్రంలో కలెక్టర్ ఎస్.రామ్ సుందర్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టి, సచివాలయం ద్వారా అందుతున్న సేవలను కలెక్టర్ (Collector) పరిశీలించారు. కొంత మంది సిబ్బంది నిర్దేశిత సమయానికి హాజరు కాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. విధి నిర్వహణ పట్ల అలసత్వం వహించిన ముగ్గురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు.

Leave a Reply