ఢిల్లీ ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: కాంగ్రెస్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి( Vivekananda Reddy) 2019 మార్చి 15న పులివెందులలోని తన స్వంత ఇంట్లో అనుమానాస్పద రీతిలో మరణించన విషయం తెలిసిందే. ఆయన హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. అఫిడవిట్ దాఖలుకు దర్యాప్తు సంస్థ సమయం కోరడంతో సుప్రీంకోర్టు(Supreme Court) ఈ నిర్ణయం తీసుకుంది. హత్యకు సంబంధించి తదుపరి దర్యాప్తు అవసరమా? కాదా? అని గతంలోనే అత్యున్నత న్యాయస్థానం సీబీఐని ప్రశ్నించింది.

దీంతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు తమకు సమయం కావాలని సీబీఐ అధికారులు కోరారు. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను జస్టిస్ ఎం. ఎం. సుందరేశ్ ధర్మాసనం నెల 16కి వాయిదా వేసింది. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

Leave a Reply