Visited | మహిళలు స్వశక్తితో ఎదగాలి..

Visited | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : మహిళలు తమ ప్రతిభ, ఆత్మవిశ్వాసం, కృషితోనే సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని, అలా ఎదిగి భవిష్యత్ తరాల(Future generations)కు ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డా. రాయపాటి శైలజ అన్నారు. మంగళవారం నగరంలోని సూర్యభవన్ దేవాలయం సమీపంలో ఉన్న శక్తి సదన్ వసతి గృహాన్ని(Shakti Sadan hostel) ఆమె ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా వసతి గృహంలో నివసిస్తున్న మహిళలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. అవసరమైన వారికి లీగల్ కౌన్సిలింగ్, సైకాలజికల్ సపోర్ట్(Psychological support) అందించాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహం నిర్వహణ విధానం, రోజువారీ రికార్డులు, హాజరు పట్టికలు, మూమెంట్ రిజిస్టర్లు సమీక్షించారు. మౌలిక వసతుల పరిశీలనలో భాగంగా వంటగది, పడకగదులు, చేతి అల్లిక యూనిట్లు, కుట్టుమిషన్లు, శిక్షణ విభాగాలు(Training Departments) పరిశీలించి మెరుగుదల కోసం సూచనలు చేశారు.
మహిళా స్వశక్తీకరణలో భాగంగా ప్రభుత్వం జన్–ధన్ ఖాతాల్లో నెలకు ₹500 డిపాజిట్లు సక్రమంగా చేరుతున్నాయో లేదో తనిఖీ చేయాలని, ఖాతాల వివరాలు నిరంతరం అప్డేట్ చేయాలని(To be updated) అధికారులను ఆదేశించారు. ధైర్యం, విద్య, ఉపాధి మహిళల పురోగతికి మూలాధారాలు అని ఆమె పేర్కొన్నారు. మహిళల భద్రత, విద్య, ఉపాధి కోసం ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోందని, మహిళలు ధైర్యంగా తమ ప్రతిభను నమ్ముకొని ముందుకు సాగాలని సూచించారు.
శక్తి సదన్‌లో చదివి ఉద్యోగాలు సాధించిన మహిళలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. వసతి గృహం నుంచే చదివి నలుగురు పోలీస్ శాఖలో, నలుగురు నర్సింగ్ రంగంలో, ఐసీడీఎస్ విభాగంలో ఉద్యోగాలు(jobs) సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రస్తుతం పలువురు యువతులు డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్జీవో ప్రతినిధులు వసతి గృహానికి స్వంత భవనం కోసం స్థల కేటాయింపు చేయాలని విజ్ఞప్తి చేయగా, సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సానుకూల చర్యలు(positive actions) తీసుకుంటామని చైర్పర్సన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ, శక్తి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి విజయరాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
