కూర్మాన్నపాలెం, ఏప్రిల్ 25(ఆంధ్రప్రభ): అతి కిరతకం గా దంపతులు హత్యకి గురైన సంఘటన దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవనగర్ లో చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న దువ్వాడ పోలీసులు జి. యుగేంద్ర బాబు (66) భార్య లక్ష్మి (54) రక్తపు మడుగులో మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే. డాక్ యార్డ్ లో ఉద్యోగ విరమణ చేసిన జి. యుగేంద్ర బాబు కి భార్య లక్ష్మి, కుమారుడు సుజిత్, కుమార్తె శిల్ప ఉన్నారు.కుమారుడు, కుమార్తె వివాహలు అయిపోయి అమెరికా లో ఉండటం తో భార్య లక్ష్మి తో కలిసి నివాసం ఉంటున్నారు. గురువారం స్థానిక గ్రామ దేవత పండగ హడావిడి లో స్థానికులు ఉండటం తో సాయంత్రం 7.30 సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రెవేశించి హత్య చేసినట్లు గా భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం బంధువులు ఇంటి వద్దకి వచ్చి చూడగా ఇంటి బయట తాళం వేసి ఉండటం తో వెళ్లిపోయారు. మళ్ళీ సాయంత్రం వచ్చి చూడగా అనుమానం రావటం తో పోలీసులు కి సమాచారం అందించార
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తాళం తొలగించి చూడగా భర్త యుగేంద్ర బాబు హల్ లో భార్య గదిలో రక్తపు మడుగులో కిరతకంగా హత్యకి గురై ఉన్నారు..గురువారం సాయంత్రం 7.30 సమయం లో గట్టిగ అరుపులు వినిపించాయి అని భార్య భర్తలు గొడవలు అనుకోని స్థానికులు వెళ్లలేదని స్థానికులు వాపోయారు.
దంపతుల హత్యలు కలకలం రేపటం తో పోలీసులు, క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. తాళం ఇంటి బయట వేసి ఉండటం తో డాగ్ స్క్వాడ్ తో పరిశీలించారు.సంఘటన స్థలాన్ని సౌత్ ఏసీపీ త్రినాధ్ పరిశీలించారు.దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.