చీకట్లోనే ఊళ్లు.. ఇంటర్నెట్ సేవలు బంద్

చీకట్లోనే ఊళ్లు.. ఇంటర్నెట్ సేవలు బంద్

చాగల్లు, ఆంధ్రప్రభ : తూర్పు గోదావరి (East Godavari) జిల్లా చాగల్లు మండలంలో మొంథా తుఫాను ప్రభావంతో జనజీవనం స్తంభించింది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులు వేయటంతో విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచింది. దీని కారణంగా రోజువారి కార్యక్రమాలు పూర్తి కాలేకపోవటంతో వ్యాపారస్థులు కేవలం ఇళ్లకే పరిమితమయ్యారు. వాతావరణం ద్రోణి ప్రభావం కారణంగా భారీస్థాయి ఈదురు గాలులు వేయటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు, భారీ స్థాయి వృక్షాలు, హోర్డింగులు నేలవాలాయి.

తెల్లవారు జాము నుంచి విద్యుత్తు సరఫరా లేకపోవటంతో తాగునీటి సరఫరాకు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు రోజుల నుంచి తుఫాను ప్రభావం ఉందని తాగునీరు కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ వాటర్ ట్యాంకులు ద్వారా తాగునీరు అందించే ఏర్పాట్లు పంచాయతీ అధికారులు చేయకపోవటంతో గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నిలిచిన బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సేవలు..

గత మూడు రోజులుగా వీస్తున్న తుఫాను కారణంగా చాగల్లులో బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సేవలు (BSNL Internet Services) నిలిచిపోయాయి. దీంతో పలు ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు లావాదేవిలు నిలిచిపోవటంతో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు దీనిపై స్పందించిన నాయకులు, అధికారులు లేకపోవటం బాధాకరం.

కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇచ్చిన స్పందన లేదు..

అత్యవసర సేవలు కోసం చాగల్లు లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ (Control room) నెంబర్ 94412 93856 కి తాగునీటి కోసం సమాచారం ఇవ్వటంతో పంచాయతీ అధికారులకు రెవెన్యూ అధికారులు ఆదేశించిన ఇంకా స్పందించకపోవడం దారుణం.

Leave a Reply