గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యం

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యం..గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని సర్పంచ్ జోగు సంపత్ కుమార్ అన్నారు. శనివారం స్టేషన్ ఘన్ పూర్ మండలం మీదికొండ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం గుడి ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎస్‌డీఎఫ్ నిధుల నుంచి రూ.4.99 లక్షల వ్యయంతో రహదారి నిర్మాణ పనులను చేపట్టారు.
ఈ పనులను గ్రామ సర్పంచ్ జోగు సంపత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దేవాలయానికి వచ్చే భక్తులకు సౌక ర్యంగా ఉండేందుకు ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టినట్లు పేర్కొన్నా రు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అలకుంట్ల శ్రీను, గౌడ్ కుల పెద్దలు వడ్ల కొండ అంజయ్య, బూరు వెంకటయ్య, కత్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
