Vikarabad | రోడ్ల పరిస్థితి అధ్వాన్నం.. పట్టించుకోని ప్రజాప్రతినిధులు

వికారాబాద్, మే 9 (ఆంధ్రప్రభ) : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేఆర్ చౌరస్తా వద్ద రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. వికారాబాద్ నుండి తాండూరు వెళ్లే మార్గంలో గల ఈ బీజేఆర్ చౌరస్తా వద్ద గత కొన్ని నెల‌లుగా రోడ్డు పరిస్థితి ఇలాగే ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు కానీ, ప్రజాప్రతినిదులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు.

జిల్లా కేంద్రం పరిస్థితి ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బీజేఆర్ వద్ద రోడ్డును బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply