VijaywedsRashmika | రౌడీబాయ్ పెళ్లి సంద‌డి..

VijaywedsRashmika | రౌడీబాయ్ పెళ్లి సంద‌డి..

VijaywedsRashmika | వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విజయ్, రష్మిక
రాజ‌స్థాన్- ఉద‌య్ పూర్‌లో మ్యారేజ్‌

VijaywedsRashmika | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులుగా వీరిద్ద‌రూ రిలేషన్‌లో ఉన్నార‌నే ప్ర‌చారం సాగింది. ఆ ఊహాగానాలకు తెరదించుతూ ఎట్ట‌కేల‌కు ఇవాళ‌ ఉదయం 10:10 గంటలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిరువురూ వివాహం చేసుకున్నారు. రష్మిక మెడలో విజ‌య్ మూడు ముళ్లు వేసి ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. అయితే వీరిద్ద‌రి వివాహం రెండు ప‌ద్ధ‌తుల‌లో వైభవంగా జరుగుతోంది. తెలుగు హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉదయం 10:10 ముహూర్తంలో హిందూ సాంప్రదాయ వివాహం.. ఇక సాయంత్రం 4:30 గంటలకు రష్మిక స్వంత కొడవ (కర్ణాటక కొడగు) సంప్రదాయ వివాహం.

VijaywedsRashmika
VijaywedsRashmika

VijaywedsRashmika | నా భర్త ని పరిచయం చేస్తున్నా

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి ఇవాళ ఘనంగా జరిగింది. ఉదయం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ లో తెలుగు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి కాగా.. సాయంత్రం కర్ణాటకలోని కొడవ సంప్రదాయం ప్రకారం వీరు పెళ్లి చేసుకున్నారు.

VijaywedsRashmika |

అతి కొద్ది మంది సమక్షంలో విరోష్ జంట ఒకటయ్యారు. హాయ్ మై లవ్స్, ఇప్పుడు మీకు “నా భర్త” ని పరిచయం చేస్తున్నాను! అతడే మిస్టర్ విజయ్ దేవరకొండ!! సోషల్ మీడియా వేదికలో పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో విరోష్ అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

VijaywedsRashmika |
VijaywedsRashmika |
VijaywedsRashmika |

click here for more cinema

more interesting movie news

Leave a Reply