విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వాలి..

విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వాలి..
రేగొండ, ఆంధ్రప్రభ : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రముఖ నాయకురాలు విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మున్నూరు కాపు, బీసీ సామాజిక వర్గ కోటాలో, వరంగల్ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించేలా ఆమెకు కేబినెట్లో అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కొందరు కోరుతున్నారు. అందులో రేగొండ మండలం నుండి తెలంగాణ ఉద్యమకారుడు ఉప సర్పంచ్ ల ఫోరమ్ మాజీ అధ్యక్షులు వావిలాల రమేష్ కాంగ్రెస్ హై కామండ్ ను కోరుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని, ముఖ్యంగా బీసీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో, రేవంత్ రెడ్డి కేబినెట్లో ఆమెకు బెర్త్ ఇవ్వాలనే డిమాండ్ ఉంది.
మున్నూరు కాపు వర్గానికి ప్రాతినిధ్యం వహించే విజయశాంతి, వరంగల్ ప్రాంతానికి చెందిన వారు కావడం, పార్టీలో కీలక పాత్ర పోషించగలరనే భావనతో ఈ పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం మంత్రుల మార్పుపై భిన్నమైన అభిప్రాయాలతో ఉన్నప్పటికీ, విజయశాంతికి కీలక పదవి ఇవ్వాలనేది అధిష్టానం ఆలోచిస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడి తెలంగాణ తల్లి పార్టీ పేరుతో తెలంగాణ యువతను ఉద్యమం వైపు నడిపిస్తూ ఉద్యమ సమయంలో ముందుండి నడిచిన ప్రస్తుత ఎమ్మెల్సీ విజయశాంతికి కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని కోరుకున్నారు.
తెలంగాణ ఉద్యమకారుల వైపు ప్రస్తుత పరిస్థితుల్లో పోరాడే శక్తి విజయశాంతికే ఉందని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని నిలదీసే దమ్ము ధైర్యం ఉన్న మహిళా శక్తి అయిన విజయశాంతికి మంత్రి పదవిని కచ్చితంగా ఇవ్వాలని వావిలాల రమేష్ డిమాండ్ చేస్తున్నారు. 2023 ఎన్నికల సమయంలో బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి, బలమైన వక్తగా, ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు పొందారు. అందుకే ఫైర్ బ్రాండ్ విజయ శాంతికీ మంత్రి పదవి ఇవ్వాలని బీసీ, నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
