ముస్లింలకు అండగా జగన్..

ముస్లింలకు అండగా జగన్..
ఎమ్మెల్సీ ఎండి రూహుళ్ల
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : విజయవాడ అంబాపురం గ్రామంలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా ఆధ్వర్యంలో మసీదు ఏ కరీమున్నిసా మదర్సా నందు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా మాట్లాడుతూ రంజాన్ మాసంలో మైనార్టీ సోదరులు కఠినమైన ఉపవాసాలతో ప్రపంచ దేశాలోని మైనార్టీ సోదరులందరూ అల్లాహ్ దయ కొరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి , ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైనార్టీ సోదరులకు అండగా ఉండే వారిని గుర్తు చేశారు. అనంతరం వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మత గురువులు, ముస్లిం మత పెద్దలు, వైసిపి మైనార్టీ విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

