Vijay | నామినేషన్ చెల్లుబాటుపై సందేహాలు

Vijay | నామినేషన్ చెల్లుబాటుపై సందేహాలు
Vijay | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : టీవీకే అధినేత విజయ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లలో తేడాలు బయటపడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు అసెంబ్లీ స్థానాలకు ఇచ్చిన వివరాల్లో వ్యత్యాసాలు ఉండటం వివాదానికి దారితీసింది.
విజయ్ ఇటీవల పోటీ చేయనున్న పెరంబూర్, తిరుచురాపల్లి ఈస్ట్ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే పెరంబూర్ స్థానానికి సమర్పించిన అఫిడవిట్‌లో తనపై ఎలాంటి కేసులు లేవని పేర్కొన్నారు.
కానీ మూడు రోజుల తరువాత తిరుచురాపల్లి ఈస్ట్ స్థానానికి సమర్పించిన నామినేషన్ అఫిడవిట్‌లో మాత్రం తనపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదై ఉన్నట్లు వెల్లడించారు. దీంతో రెండు అఫిడవిట్లలో స్పష్టమైన వ్యత్యాసం కనిపించింది.
ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ చెల్లుబాటుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే నామినేషన్‌ను తిరస్కరించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
