Vijay devarakonda | ఆ ప్రాజెక్ట్ కు నో చెప్పాడా..?

Vijay devarakonda | ఆ ప్రాజెక్ట్ కు నో చెప్పాడా..?

Vijay devarakonda | విజయ్ దేవరకొండ లైనప్ హాట్ టాపిక్
దిల్ రాజు బ్యానర్‌లో ఇంద్రగంటి ప్లాన్
ఫ్లాప్స్‌తో ఆగిపోయిన ప్రాజెక్ట్?
రోషన్‌తో ఇంద్రగంటి కొత్త సినిమా
2027లో విజయ్–ఇంద్రగంటి మూవీ?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ లైనప్ మామూలుగా లేదు. ఓ వైపు రౌడీ జనార్థన, రణబాలి సినిమాలు చేస్తున్నాడు. మరో వైపు విక్రమ్ కే కుమార్ తో మూవీ ప్లానింగ్ లో ఉంది. వీటితో పాటు ఒకటి రెండు ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలిసింది. అయితే.. విజయ్ దేవరకొండ కోసం ఇంద్రగంటి మోహనకృష్ణ ఓ భారీ స్టోరీ రెడీ చేస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఈ మూవీని దిల్ రాజు నిర్మించాలి అనుకున్నారు కానీ.. దీనికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఏమైంది..?

Vijay devarakonda | దిల్ రాజు బ్యానర్ లో ఇంద్రగంటి..

Vijay devarakonda

గ్రహణం సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆతర్వాత భూమిక చావ్లా, రాజా ప్రధాన పాత్రల్లో మాయాబజర్ అనే సినిమా చేశారు. బాగానే వుందనే పేరు వచ్చింది కానీ.. ఆశించినతంగా ఆకట్టుకోలేదు. ఇక అష్టా చమ్మా సినిమాతో ఇంద్రగంటి పేరు మారుమ్రోగింది. ఆతర్వాత గోల్కండ హైస్కూల్, అంతకు ముందు ఆతరువాత, జంటిల్ మేన్, అమితుమి, సమ్మోహనం సినిమాలతో సక్సెస్ సాధించారు. ఈ టైమ్ లోనే విజయ్ దేవరకొండతో భారీ సినిమా చేయాలని కథ రెడీ చేసారు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాలి అనుకున్నారు.

Vijay devarakonda | రోషన్, ఇంద్రగంటి మూవీ..

Vijay devarakonda

అయితే.. విజయ్ దేవరకొండ సినిమాలు లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు ఫ్లాప్ అవ్వడం.. అలాగే ఇంద్రగంటి తీసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా కూడా ఆకట్టుకోలేదు. ఆతర్వాత విజయ్, ఇంద్రగంటి కాంబో మూవీ ముందుకు వెళ్లలేదు. విజయ్ తన సినిమాలతో బిజీ అయ్యారు. ఇంద్రగంటి తన వర్క్ లో బిజీ అయ్యారు. ఇప్పుడు ఇంద్రగంటి శ్రీకాంత్ తనయుడు రోషన్ తో సినిమా చేయనున్నారని తెలిసింది. ఛాంపియన్ మూవీతో ఆకట్టుకున్న రోషన్ శైలేష్ కొలనుతో ఏమో ఏమో ఇది అనే సినిమా చేస్తున్నాడు.

Vijay devarakonda | 2027లో విజయ్ మూవీ..

Vijay devarakonda

ఈ సినిమా తర్వాత ఇంద్రగంటితో సినిమా ఉంటుందని సమాచారం. ఈ మూవీని అశోక్ వ‌ర్ద‌న్ ముప్పా నిర్మించనున్నారు. అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతీ చిత్రానికి నిర్మాత ఈయ‌న‌. ఇప్పుడు ఇదే బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌బోతున్నారు. హీరోగా రోష‌న్ ని ఫైనల్ చేశారు. క‌థా చ‌ర్చ‌లు పూర్త‌య్యాయి. ఇంద్ర‌గంటి స్టైల్ లో సాగే టిపిక‌ల్ ల‌వ్ స్టోరీ ఇది. ఎంటర్ టైన్మెంట్ కి ఎక్కువ స్కోప్ ఉన్న కథ ఇదని తెలిసింది. మరి.. విజయ్ దేవరకొండతో ఇంద్రగంటి మూవీ లేదా అంటే.. ఉందనే టాక్ వినిపిస్తుంది. 2027లో ఉండచ్చు అంటున్నారు. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా విజయ్, ఇంద్రగంటి మూవీ ఉంటుందో లేదో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a Reply