Vijay devarakonda | రష్మిక పెళ్లి నిజమేనా..?

Vijay devarakonda | రష్మిక పెళ్లి నిజమేనా..?
Vijay devarakonda | ఆంద్రప్రభ వెబ్ డెస్క్ : సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక.. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని.. ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఎంగేజ్ మెంట్ అయ్యిందని.. విజయ్, రష్మికల పెళ్లి ఫిక్స్ అంటూ ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో (Social Media) అయితే.. ఈ న్యూస్ తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు ఇదే ప్రశ్న రష్మికను అడిగితే.. అసలు విషయం చెప్పింది. ఇంతకీ.. ఏం చెప్పింది.

Vijay devarakonda | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా..
వీళ్లిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్టుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈమధ్య కాలంలో ఎంగేజ్ మెంట్ జరిగిందని వార్తలు రావడంతో పెళ్లి (Marriage) గురించి కూడా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. డేట్ ఫిక్స్ అయ్యిందని.. ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వీరిద్దరి పెళ్లి జరగనుందనే ప్రచారం మొదలైంది. కానీ.. అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. ఈ విషయంపై ఇద్దరూ ఇప్పటి వరకు మౌనంగానే ఉన్నారు. దీంతో వీరి మ్యారేజ్ గురించి సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది.

Vijay devarakonda | ఎప్పుడు క్లారిటీ ఇస్తారు
ఇటీవల ఓ సందర్భంలో రష్మిక తన పెళ్లి వార్తల పై స్పందించింది. ఇంతకీ.. రష్మిక (Rashmika) ఏం చెప్పిందంటే.. ఈ రూమర్స్ మొదలై నాలుగేళ్లు అవుతోంది. అప్పటి నుంచి అందరూ అదే ప్రశ్న అడుగుతున్నారు. కానీ నిజం ఏమిటంటే.. మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రమే మేము మాట్లాడతాం అని ఆమె క్లారిటీగా చెప్పింది. దీంతో మళ్లీ సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎప్పుడు క్లారిటీ ఇస్తారు అనేది మాత్రం చెప్పలేదు. రష్మిక ఇలా రియాక్ట్ అవ్వడంతో నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా..? లేక అలాంటిది ఏమీ లేదు గాసిప్ అని చెబుతారా..? అసలు ఏం జరుగుతుంది అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి.. క్లారిటీ రావాలంటే.. ఫిబ్రవరి 26 వరకు వెయిట్ చేయాల్సిందేనేమో..

